విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు స్పందించారు. ఈ ప్రమాదాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిపారు. బస్సు ప్రమాదం సాంకేతిక లోపమా? మానవ తప్పిదంతో జరిగిందా? అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వారికి చికిత్సకు మెుత్తం అయ్యే ఖర్చును ఆర్టీసీ యాజమాన్యం భరిస్తుందని తెలిపారు. బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల ప్రమాదం జరిగిందని అంటున్నారని చెప్పుకొచ్చారు. రివర్స్ గేర్ వేయడంతో అది ఫెయిల్ అయ్యిందని ఫ్రంట్‌కు రావడంతో ప్రమాదం జరిగిందని అంటున్నారని తెలిపారు. మెుత్తానికి ఈ ప్రమాదంపై విచారణ జరిపి 24 గంటల్లో నిందితులపై చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. ఇకపోతే విజయవాడలో సోమవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన లగ్జరీ బస్సు నెహ్రూ బస్టాండ్ లో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కండక్టర్, ఓ మహిళా, మరో చిన్నారి కూడా మృతి చెందారు. ప్లాట్ ఫామ్ 12 దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన ఏపీ సర్వీసు మెట్రో లగ్జరీ బస్సు ప్రమాదానికి గురైనట్లు తెలిపింది. బ్రేక్ ఫెయిలై ఫ్టాట్ ఫాం పైకి దూసుకెళ్లిన దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. డ్రైవర్ రివర్స్ గేర్ బదులు ఫస్ట్ గేర్ వేయడమే ప్రమాదానికి కారణం తెలుస్తోంది.
బస్సు ప్రమాదం: విజయవాడ బస్సు ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ మాటల్లో…
124
previous post