బాబు బెయిల్ పై స్పందించిన రఘురామకృష్ణరాజు

Raghu rama krishnaraju

Advertisements

&NewLine;<p>టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరైన తర్వాత వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందిస్తూ సీఎం జగన్ పై మండిపడ్డారు&period; జైలు నుంచి చంద్రబాబు ప్రాణాలతో బయటపడ్డారని… మరికొన్ని రోజులు జైల్లో ఉంటే ఆయన ప్రాణాలకు ఈ దుర్మార్గులు హాని కలిగించే వారని అన్నారు&period; కొన్ని గంటల్లో చంద్రబాబు జైలు నుంచి బయటకు రానున్నారని చెప్పారు&period; తనపై కూడా ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి జగన్ 16 నుంచి 18 కేసులు పెట్టించాడని మండిపడ్డారు&period; తాను విడుదలైన తర్వాత తిరుమల వెంకన్నను దర్శించుకోవాలనుకున్నానని… అయితే&comma; ఆ దేవున్ని కూడా తనకు ఈ ముఖ్యమంత్రి దూరం చేశాడని అన్నారు&period; చంద్రబాబు విషయంలో న్యాయమూర్తి ద్వారా వెంకటేశ్వరస్వామి న్యాయాన్ని పలికించారని రఘురాజు చెప్పారు&period; వెంకటేశ్వరస్వామిని చంద్రబాబు దర్శనం చేసుకుని&comma; ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని&comma; నూతనోత్తేజంతో మళ్లీ ప్రజల మధ్య అడుగు పెట్టాలని కోరుకుంటున్నానని అన్నారు&period; ఆయనను బాధ పెట్టిన అందరినీ రాజకీయంగా కడతేర్చాలని కోరుకుంటున్నానని చెప్పారు&period; వెంకన్న స్వామిని దర్శనం చేసుకుంటే అంతా మంచే జరుగుతుందని… తాను తిరుమల వెంకన్నను దర్శనం చేసుకోలేక అమెరికాలోని వెంకటేశ్వరస్వామి దేవాలయాన్నీ తిరిగానని అన్నారు&period; మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న వెంకన్న ఆలయాలన్నీ ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నానని చెప్పారు&period; తాను ఏపీలోకి ఇప్పుడు అడుగు పెట్టే పరిస్థితి లేదని అన్నారు&period; చంద్రబాబుకు బెయిల్ వస్తుందని ముందే ఊహించే… లిక్కర్ కేసులో ఆయనపై మరో కేసు పెట్టారని మండిపడ్డారు&period; ఈ నాలుగు వారాల్లో చంద్రబాబును ఏ కేసులో కూడా అరెస్ట్ చేయలేరని చెప్పారు&period; చంద్రబాబుపై పెట్టిన ఐదు కేసులూ రెడ్లు పెట్టారని విమర్శించారు&period; కేసులు కట్టేది కూడా రెడ్డేనని&comma; మధ్యలో కథ నడిపించేందరి సజ్జల రామకృష్ణారెడ్డి అని&comma; పైనుంచి నడిపించేది జగన్ రెడ్డి అని అన్నారు&period; రెడ్లు తప్ప మరెవరూ లేరని… ఈ విషయాన్ని చెప్పడానికి తాను సంకోచించనని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.

పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు.. భారీ బైక్ ర్యాలీ.

అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన.