బీజేపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు..

BJP, Jan Sena Partya

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు ఖరారైన నేపథ్యంలో ఆదివారం తదుపరి ఉమ్మడి కార్యచరణను ప్రకటించనున్నారని సమాచారం&period; పొత్తుకు సంబంధించి శనివారం రాత్రి జనసేనాని పవన్ కల్యాణ్ నివాసంలో కీలక చర్చలు జరిగాయి&period; ఎన్నికల్లో ఇరు పార్టీల అభ్యర్థుల విజయానికి ఉమ్మడిగా పనిచేయాలని నిర్ణయించారు&period; ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్‌రెడ్డి&comma; ఎంపీ లక్ష్మణ్‌&comma; జనసేన తరపున నాదెండ్ల మనోహర్‌ పాల్గొన్నారు&period; జనసేన ఏయే నియోజకవర్గల్లో పోటీ చేయనుందనే అంశంతోపాటు తదుపరి కార్యాచరణను ఆదివారం వెల్లడించనున్నారని సమాచారం&period; మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 7à°¨ తెలంగాణకు వస్తున్నారు&period; ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించే బీసీ ఆత్మగౌరవ సభకు హాజరుకావాలని కోరగా పవన్‌కల్యాణ్‌ సానుకూలంగా స్పందించారని బీజేపీ వెల్లడించింది&period;ఎన్‌డీయేలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ గతంలో అసెంబ్లీ&comma; కార్పొరేషన్‌ ఎన్నికల్లో సంపూర్ణంగా సహకరించిందని&comma; ఈ ఎన్నికల్లో జనసేనతో సీట్ల సర్దుబాటు కొలిక్కివచ్చిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు&period; ఇదిలావుండగా జనసేన 9 స్థానాల్లో పోటీ చేసేందుకు ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే&period; ఏయే స్థానాల్లో బరిలోకి దిగబోతోందనేది త్వరలోనే వెల్లడికానుంది&period; మరోవైపు బీజేపీ ఇప్పటికే ఇప్పటికే 88 మంది అభ్యర్థులను ప్రకటించింది&period; జనసేనకు 9 నియోజకవర్గాలను మినహాయించగా ఇంకా 22 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.