86
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో మిచౌంగ్ తుఫాను ప్రభావం తో భారీ వర్షం కురవడంతో పట్టణంలోని రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. నరసాపురం పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉండడంతో ఈ భారీ వర్షానికి డ్రైన్లు పొంగి రోడ్లు పైకి వచ్చి రోడ్లు అధ్వానంగా తయారవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారుల పైకి డ్రైన్ వాటర్ పొంగిపొర్లడంతో రహదారులపై వర్షపు నీరుతో పాటు ట్రైన్లు మురుగు చేరడంతో రహదారులపై ఇటు అటు వాహనాలు పై ప్రయాణించే ప్రయాణికులు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మున్సిపాలిటీ అధికారులు ఎప్పటికైనా డ్రైన్ సరిచేయాలని దుర్వాసన రాకుండా తక్షణమే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరుతున్నారు.