cyclone michaung latest updates
ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం కొంగవారిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్రకాల్వ జలాశయానికి పెరుగుతున్న వరద ఉదృతి. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 83.50 మీటర్లు కాగా ప్రస్తుతం 82.68 మీటర్ల చేరుకున్న నీటిమట్టం. ప్రాజెక్ట్ లోకి ప్రస్తుతం.15372 క్యూసెక్కుల చేరుతున్న నీరు.ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 4.428 టి.ఎం.సి.లు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి 1400 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో మిచౌంగ్ తుఫాను ప్రభావం తో భారీ వర్షం కురవడంతో పట్టణంలోని రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. నరసాపురం పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉండడంతో ఈ భారీ వర్షానికి డ్రైన్లు పొంగి రోడ్లు పైకి వచ్చి రోడ్లు అధ్వానంగా తయారవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారుల పైకి డ్రైన్ వాటర్ పొంగిపొర్లడంతో రహదారులపై వర్షపు నీరుతో పాటు ట్రైన్లు మురుగు చేరడంతో రహదారులపై ఇటు అటు వాహనాలు పై ప్రయాణించే ప్రయాణికులు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మున్సిపాలిటీ అధికారులు ఎప్పటికైనా డ్రైన్ సరిచేయాలని దుర్వాసన రాకుండా తక్షణమే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరుతున్నారు.
బాపట్ల జిల్లా, వేమురు నియోజకవర్గం, యుద్ధ ప్రాదిపదికన నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ మేరుగ నాగార్జున తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మీచాంగ్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ఆయన తెలిపారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు, వీధురు గాలులకు నేలమట్టమయిన లంకల ప్రాంతాలలోని వాణిజ్య పంటలు పసుపు ,కంద, అరటి నీటమునిగాయని వరి పంట చేతికొచ్చే సమయానికి తుఫాను భారీ వర్షాలు పూర్తిగా నీటమునిగి రైతులు చాలా నష్టపోయారని ఆరుగలం పండించిన పంట చేతికి వచ్చే సమయానికి ఇలా ప్రకృతి వైపరీత్యాలు జరగటం చాలా బాధాకరం రైతులకు తీరని లోటుని మంత్రి నాగార్జున కు ఆవేదన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం మాదిరిగా మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాటలతో సరిపెట్టబోదని, అధికారులు రూపొందించిన నివేదిక ప్రకారం నష్టపరిహారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఏలూరు జిల్లా, కైకలూరు నియోజకవర్గంలో చేతికొచ్చిన వరి పంటలతో రాబోవు సంక్రాంతి నిబంధువులతో ఘనంగా జరుపుకోవాలని రైతులు ఆసక్తిగా చూస్తున్న సమయంలో మిచోంగ్ తుఫాను ప్రభావంతో చేతికొచ్చిన వరి పంటలతో అన్నదాత ఇబ్బందులు పడుతున్నారు. కైకలూరు నియోజకవర్గం నియోజకవర్గంలో అక్కడక్కడ నేలకొరిగిన వరి పంటలు. కొన్ని చోట్ల తుఫాను హెచ్చరికతో వరి కోతలు నిలిపివేశారువరి పంట బాగా పండింది అనుకున్న టైంలోప్రకృతి వైపరీత్యం వల్ల అన్నదాతఆవేదన గురవుతున్నాడు.
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుఫాను మిచౌంగ్. ప్రస్తుతానికి చెన్నైకి 170 కి.మీ, నెల్లూరుకు 20 కి.మీ, బాపట్లకు 150 కి.మీ, మచిలీపట్నానికి 210కి.మీ. దూరంలో తుఫాన్. మధ్యాహ్ననికి నెల్లూరు – మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్రతుఫానుగా తీరం దాటనున్న మిచౌంగ్. తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు. కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, పలుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ తీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం. రేపు రాయలసీమల, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాలు నమోదైయ్యే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.





Total views : 79497