భావి భారత పౌరులైన విద్యార్థులకు చట్టసభల పనితీరుపై అవగాహన కల్పించేలా ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికైంది.

Advertisements

<p>భావి భారత పౌరులైన విద్యార్థులకు చట్టసభల పనితీరుపై అవగాహన కల్పించేలా ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికైంది&period; సుమారు 300 మంది విద్యార్థులు అసెంబ్లీని సందర్శించి&comma; సభా వ్యవహారాలను ప్రత్యక్షంగా వీక్షించారు&period; గత ఐదు రోజులుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు దాదాపు 1100 మంది విద్యార్థులు ప్రజాస్వామ్య దేవాలయాన్ని సందర్శించడం విశేషం&period; ప్రజా సమస్యలపై చర్చలు ఎలా జరుగుతాయి&comma; చట్టాల రూపకల్పన ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనే అంశాలను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా గమనించారు&period;&ZeroWidthSpace;సభా విరామ సమయంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు&comma; డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుతో పాటు ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి&comma; కామినేని శ్రీనివాస్&comma; విష్ణుకుమార్ రాజు&comma; పత్తిపాటి పుల్లారావు&comma; బోండా ఉమామహేశ్వరరావు తదితరులు విద్యార్థుల వద్దకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు&period; విద్యార్థులు అడిగిన పలు సందేహాలకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఓపికగా సమాధానాలు ఇచ్చారు&period; విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకుని దేశాభివృద్ధిలో కీలక భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా నేతలు ఆకాంక్షించారు&period; అనంతరం విద్యార్థులతో కలిసి గ్రూపు ఫోటోలు దిగారు&period; చట్టసభల వాతావరణాన్ని స్వయంగా చూడటం తమకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చిందని&comma; ఈ పర్యటన తమలో సరికొత్త స్ఫూర్తిని నింపిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో మరోసారి వివాదం..

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం..

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం..