మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం..

Advertisements

<p>మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది&period; రాయవరం సమీపంలో ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు&period;&period;ముందు వెళ్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది&period; వెంటనే బస్సుకు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది&period; ఈ ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది&period; పలువురికి తీవ్రగాయాలవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది&period; సమాచారమందుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు&comma; ఫైర్‌ సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు&period;<&sol;p>&NewLine;<p>హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామూరుకు దాదాపు 40 మంది ప్రయాణికులతో బయలుదేరిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు&period;&period;మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని క్వారీల వద్దకు రాగానే&comma; ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని బలంగా ఢీకొట్టింది&period; ప్రమాద తీవ్రతకు బస్సు డీజిల్ ట్యాంక్ పగిలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి&period; వేగంగా వ్యాపించిన మంటల్లో బస్సు&comma; టిప్పర్ రెండూ చిక్కుకున్నాయి&period; ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది&period; కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు&period; మరికొంతమంది మాత్రం మంటల్లో చిక్కుకుని బయటకు రాలేక సజీవ దహనమయ్యారు&period;<&sol;p>&NewLine;<p>సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు&comma; అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు&period; గాయపడినవారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది&period; ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు&period; గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.