111
వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవ శ్రీ తూడి ఉన్న మేఘారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తో బుధవారం మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన సతీమణి శారదతో కలిసి వారి ఇంటి దైవం సింగోటం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించుకుని దంపతులిద్దరూ పూజలు చేశారు. అక్కడి నుంచి సొంత గ్రామం మంగంపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో గ్రామస్తులతో కలిసి దంపతులిద్దరూ ప్రత్యేక పూజలు చేశారు. స్వర్గస్తులైన వారి తల్లిదండ్రులు వెంకటమ్మ సాయిరెడ్డిల చిత్రపటాల వద్ద నమస్కరించి వనపర్తికి బయలుదేరారు. వనపర్తి రామాలయంలోను ప్రత్యేక పూజలు చేసిన ఆయన అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ చేరుకున్నా ఆయన నామినేషన్ దాఖలు చేశారు.