ఏలూరు జిల్లా(Eluru District) పెదవేగి మండలం గోపన్నపాలెం(Gopannapalem)లో వైసీపీ(YCP), కాంగ్రెస్ నేతల(Congress leaders) మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్తల దాడిలో కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలకు గాయాలు తగిలాయి. ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో కాంగ్రెస్ ప్రచార వాహనంపై వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కాంగ్రెస్ పార్టీ ప్రచార రథం ధ్వంసం అయింది. వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడ్డ కాంగ్రెస్ మహిళా కార్యకర్తలను ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. గంగన్నగూడెం రహదారిపై బైఠాయించి కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన తెలియజేశారు. కనీసం మహిళలని చూడకుండా వైసీపీ నేతలు తమపై దాడికి పాల్పడ్డారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఆరోపణలు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిన్న శ్రీను.ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
- టీడీపీ శ్రేణులకు లోకేశ్ కీలక సందేశం.టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ రాష్ట్రవ్యాప్తంగా ‘నిజం గెలిచింది’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. చంద్రబాబును 53 రోజుల పాటు జైల్లో నిర్బంధించినందుకు నిరసనగా, ఆయన నిర్దోషిగా బయటకు వచ్చినందుకు…
- ఇవాళ కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా పి.గన్నవరం నియోజకవర్గంలోని పండువారిపేటలో జరిగే గ్రామసభలో సీఎం పాల్గొని లబ్ధిదారులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. అంతకుముందు మాచవరం జయంతి నగర్లో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.