209
యాలకులు తినడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. ఏలకుల వల్ల ఎంజైమ్‌ల స్రావం ప్రేరేపితం అయి జీర్ణక్రియకు సహాయపడుతుంది. తద్వారా ఉబ్బరం, గ్యాస్, కడుపు తిమ్మిరి వంటి సాధారణ జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. యాలకులు సహజ మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తారు. నిత్యం నమలడం వల్ల నోటి దుర్వాసన పోయి నోరు తాజాగా ఉంటుంది. అంతేకాకుండా ఎల్లప్పుడూ తాజా శ్వాసను అందిస్తుంది. అంతేకాకుండా దంత సమస్యలు కూడా దూరమవుతాయి.యాలకులు సహజసిద్ధమైన రక్తాన్ని పల్చగా చేసేలా పనిచేస్తుంది. దీనివల్ల సిరల్లో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీన్ని తినడం వల్ల రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.