మనం వాడే మసాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో బిర్యానీ ఆకు ఒకటి. బిర్యానీ ఆకులని వాడడం వల్ల ఎలాంటి సమస్యలు దూరమవుతాయో తెలుసుకోండి. పలావ్ ఆకుల్లో లెనోలోల్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి వాపు, నొప్పి, కీళ్ళ దృఢత్వం వంటి సమస్యల నుండి ఉపశమనం ఉంటుంది. ఇది మన ఎముకల సమస్యల్ని దూరం చేస్తుంది. ఈ ఆకుల్ని తింటే జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఈ ఆకులు జీర్ణ రసాలను ఉత్పత్తి చేయడంలో పని చేస్తాయి. దీని వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. మలబద్దకం, అజీర్ణం, వికారం, వాంతులు, ఆపానవాయువు, గ్యాస్ట్రిక్ సమస్యలు దూరమై జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. బిర్యానీ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు మన బాడీలో ఎదురయ్యే బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుండి మనల్ని రక్షిస్తాయి. వాస్తవానికి దీని వల్ల ఇమ్యూనిటీ బంగా మారుతుంది. ముందుగా చెప్పినట్లు బిర్యానీ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. దీని వల్ల క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి వీటికి ఉంది. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే ఫైటోకెమికల్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. వీటిని మన డైట్లో యాడ్ చేస్తే ప్రాణాంత క్యాన్సర్స్ నుండి రక్షించుకోవచ్చు. అయితే, గర్బిణీలు తినే ముంది డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. ఈ ఆకులు తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని పొడి చేసి, క్యాప్సూల్స్ రూపంలో కూడా మార్కెట్లో దొరుకుతాయి. వీటిని తీసుకుంటే మన బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఇప్పటికే కంట్రోల్ లేని షుగర్, ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారు దీనిని వాడొచ్చు. ఈ ఆకులని ఎలా తీసుకోవచ్చు. టీ, రైస్ బాత్, వెజిటేబుల్ బాత్, కూరల్లో వాడడం ఇలా ఎలా అయినా తీసుకోవచ్చు.
tea
కాఫీలు, టీలు కడుపు నింపుతాయా, ఆరోగ్యాన్నిస్తాయా అని చాలా మంది సణుగుతూ ఉంటారు. దానికి కారణం దాని వల్ల ఆరోగ్యానికి ఏదైనా హాని జరుగుతుందేమోనన్న భయంతో. కానీ ఇప్పుడు భోజనాన్ని తగ్గించి మరీ రోజుకోసారైనా కాఫీ తాగండీ, ఆరోగ్యాన్ని కాపాడుకోండని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా వరకు చూస్తే కొంతమంది జ్ఞాపక శక్తి తగ్గిపోతోందని బాధపడుతుంటారు. అయితే ఇక నుంచి కాఫీ తాగండి. నడుం కొలత పెరిగిపోతోందని దిగులు పడుతున్న వారు కూడా కాఫీ తాగితే వారి బాధ తగ్గిపోతుంది. ఈ వాస్తవాలన్నీ ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడయ్యాయి. రాత్రి పూట భోజనం మితంగా తీసుకుని ఒక కప్పు కాఫీ తాగితే జ్ఞాపక శక్తి పెరగడంతోపాటు నడుం కూడా సన్న బడుతుందట. మెదడు చురుగ్గా పనిచేయాలంటే అప్పుడప్పుడు కడుపును మాడ్చుకుంటే మంచిదని కూడా డాక్టర్లు చెబుతున్నారు. ఇలా ఉపవాసం ఉండటం వల్ల ఒంట్లోని క్యాలరీలు ఖర్చయి ఆరోగ్యవంతంగా ఉండడంతోపాటు ఆయుర్దాయం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. క్యాలరీలు బాగా ఖర్చయితే జ్ఞాపకశక్తికి, పరిజ్ఞాన శక్తికి అవసరమైన మెదడులోని సీఆర్ఈబీఐ అనే ప్రోటీన్ బాగా ఉత్పత్తి అవుతుందని వైద్య పరిశోధనలో తేలింది. ఇలా చేయడం వల్ల రోజుకు సుమారు 600 క్యాలరీలు ఖర్చవుతాయట. అందువల్ల కాఫీలు తాగితే ఆరోగ్యం చెడిపోతుందన్న అపోహలు వదిలేసి మితాహారం, కప్పు కాఫీతో మీ రాత్రి మెనూ సి
టీ ఆస్వాదించడం చాలా మందికి ఇష్టం. టీతో కొన్ని స్నాక్స్ కూడా తింటారు. అయితే, కొన్ని స్నాక్స్ తినకపోవడమే మంచిది. ఫ్రిజ్ నుంచి తీసిన చల్లటి ఫుడ్స్ కూడా తీసుకుని టీలు తాగడం అస్సలు మంచిది కాదు. ఐస్ క్రీమ్స్, బఠానీలు, స్వీట్ కార్న్ వంటి పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. చాలా మందికి టీ తాగుతూ వేడి వేడి బజ్జీలు, బోండా, పకోడి వంటివి తినడం అలవాటు. ఎపుడైనా సరే ఓకే కానీ రెగ్యులర్ గా తినే గ్యాస్ క్రియేట్ అవుతుంది. వేడివేడి టీతో పండ్లని తీసుకోవద్దు. రెండూ శరీరంలోకి వెళ్ళినప్పుడు కడుపులో ఇబ్బంది తలెత్తుతుంది. ఉప్పగా, ఆమ్లంగా మారుతుంది.నిమ్మరసం వంటి విటమిన్ సి ఫుడ్స్ టీతో కలిపి తీసుకోవద్దు. సిట్రిక్ ఆస్కార్బిక్ యాసిడ్ అనేది టీలోని కెఫిన్‌తో కలిసి జీర్ణసమస్యలకి కారణమవుతుంది.ఇప్పుడు చెప్పేవన్నీ కూడా టీతో పాటు వీటిని తీసుకోకపోవడం మంచిది.
యాలకులు తినడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. ఏలకుల వల్ల ఎంజైమ్‌ల స్రావం ప్రేరేపితం అయి జీర్ణక్రియకు సహాయపడుతుంది. తద్వారా ఉబ్బరం, గ్యాస్, కడుపు తిమ్మిరి వంటి సాధారణ జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. యాలకులు సహజ మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తారు. నిత్యం నమలడం వల్ల నోటి దుర్వాసన పోయి నోరు తాజాగా ఉంటుంది. అంతేకాకుండా ఎల్లప్పుడూ తాజా శ్వాసను అందిస్తుంది. అంతేకాకుండా దంత సమస్యలు కూడా దూరమవుతాయి.యాలకులు సహజసిద్ధమైన రక్తాన్ని పల్చగా చేసేలా పనిచేస్తుంది. దీనివల్ల సిరల్లో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీన్ని తినడం వల్ల రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.






Total views : 77964