Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Health బిర్యానీ ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు

బిర్యానీ ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు

by Satya
Biryani Leaves

మనం వాడే మసాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో బిర్యానీ ఆకు ఒకటి. బిర్యానీ ఆకులని వాడడం వల్ల ఎలాంటి సమస్యలు దూరమవుతాయో తెలుసుకోండి. పలావ్ ఆకుల్లో లెనోలోల్ అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి వాపు, నొప్పి, కీళ్ళ దృఢత్వం వంటి సమస్యల నుండి ఉపశమనం ఉంటుంది. ఇది మన ఎముకల సమస్యల్ని దూరం చేస్తుంది. ఈ ఆకుల్ని తింటే జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఈ ఆకులు జీర్ణ రసాలను ఉత్పత్తి చేయడంలో పని చేస్తాయి. దీని వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. మలబద్దకం, అజీర్ణం, వికారం, వాంతులు, ఆపానవాయువు, గ్యాస్ట్రిక్ సమస్యలు దూరమై జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. బిర్యానీ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు మన బాడీలో ఎదురయ్యే బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుండి మనల్ని రక్షిస్తాయి. వాస్తవానికి దీని వల్ల ఇమ్యూనిటీ బంగా మారుతుంది. ముందుగా చెప్పినట్లు బిర్యానీ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. దీని వల్ల క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి వీటికి ఉంది. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే ఫైటోకెమికల్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. వీటిని మన డైట్‌లో యాడ్ చేస్తే ప్రాణాంత క్యాన్సర్స్ నుండి రక్షించుకోవచ్చు. అయితే, గర్బిణీలు తినే ముంది డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. ఈ ఆకులు తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని పొడి చేసి, క్యాప్సూల్స్ రూపంలో కూడా మార్కెట్‌లో దొరుకుతాయి. వీటిని తీసుకుంటే మన బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఇప్పటికే కంట్రోల్ లేని షుగర్, ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారు దీనిని వాడొచ్చు. ఈ ఆకులని ఎలా తీసుకోవచ్చు. టీ, రైస్ బాత్, వెజిటేబుల్ బాత్, కూరల్లో వాడడం ఇలా ఎలా అయినా తీసుకోవచ్చు.

Advertisements

You may also like

Our Visitor

039077
Total views : 194200

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: