ఆలోచనలు వెర్రితలలు వేస్తే అది విపరీత ధోరణి అనుకుంటాం. కానీ ఆ స్థాయిని కూడా దాటిపోతే దాన్ని ఏమనాలి? ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన గురించి తెలిస్తే ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. తనతో సన్నిహితంగా ఉంటున్న యువకుడిపై మోజు పడిన వ్యక్తి ఆ యువకుడికి తెలియకుండానే లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించిన ఘటన వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
ముజఫర్ నగర్ కు చెందిన 20 ఏళ్ల ముజాహిద్ అనే యువకుడు ఓం ప్రకాశ్ అనే వ్యక్తితో రెండేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు. ఇటీవల యువకుడు అనారోగ్యానికి గురికాగా తాను ఆసుపత్రికి తీసుకెళ్తానంటూ ఓం ప్రకాశ్ ను ఆ యువకుడిని మన్సూర్ పూర్ లోని ఓ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడి డాక్టర్లు ముజాహిద్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, ఓ శస్త్రచికిత్స చేయాలని సూచించారు. నిజమేనని నమ్మిన యువకుడు శస్త్రచికిత్సకు సిద్దమయ్యారు.
అయితే, వైద్యులు ముజాహిద్ కు లింగ మార్పిడి చేశారు. మత్తు మందు కారణంగా తనకు ఎలాంటి శస్త్రచికిత్స నిర్వహించారో ఆ యువకుడు గుర్తించలేకపోయాడు. ఆ తర్వాత ఓం ప్రకాశ్ వచ్చి ఇప్పుడు నువ్వు అమ్మాయిగా మారిపోయావు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, జీవితాంతం మనం కలిసే ఉండొచ్చు అని చెప్పాడు.
దాంతో దిగ్ర్భాంతికి గురైన ఆ యువకుడు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఓం ప్రకాశ్ ను అరెస్టు చేశారు.
కాగా, పెళ్లికి ఒప్పుకోకపోతే తన తండ్రిని చంపేస్తానంటూ ఓం ప్రకాశ్ బెదిరించాడని, తమ భూమిని కూడా లాక్కున్నాడని బాధిత యువకుడు ఆరోపించాడు.
ఈ ఘటనపై భారతీయ కిసాన్ యూనియన్ సభ్యులు తీవ్రంగా స్పందించారు. నిందితుడు ఓం ప్రకాశ్ తో పాటు, లింగ మార్పిడి చేసిన బేగ్ రాజ్ పూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి డాక్టర్లనూ కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బాధాకరమైన ఘటనతో యువకుడు శారీరకంగా, మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నాడని, అతనికి రూ. 2 కోట్ల పరిహారం చెల్లించాలని కిసాన్ యూనియన్ నేతలు స్పష్టం చేశారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక…
- విష్ణు గొడవ చేయలేదు … మనోజ్ కావాలనే ఇదంతా చేస్తున్నాడుమంచు మనోజ్ ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదన్నారు తల్లి మంచు నిర్మల. మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ వివాదంపై ఆయన భార్య నిర్మల తొలిసారి స్పందించారు. మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.