అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని“ వేడుకగా జరుపుకోవడమనేది ప్రపంచ క్యాలెండర్ లో ఒక భాగం. దీని అసలైన ప్రాముఖ్యత మన ఆత్మల లోపల ఉంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవ అసలైన ప్రాముఖ్యత ఇదే! ‘యోగా’ లేక ‘యోగ్’ అంటే ‘ఈశ్వరుడితో కలయిక ‘అని భావార్థం. అన్ని ఆత్మలూ అంతరికంగా వాంఛించే అసలైన కలయిక. ఈ భూమిపై జీవించే మానవుల్లో చాలామంది ‘యోగ’ అన్న మాట వినే ఉంటారు. కానీ వారిలో అత్యధికులు యోగ అంటే శారీరక వ్యాయామాలైన యోగాసనాలు (హఠ యోగం) గా భావిస్తారు. అయినప్పటికీ యోగంలో మనం అర్థం చేసుకొని ఆచరించాల్సింది ఎంతో ఉంది.
ప్రఖ్యాత ఆధ్యాత్మిక గ్రంథం “ఒక యోగి ఆత్మకథ” రచయిత అయిన పరమహంస యోగానంద సత్యాన్వేషకులకు యోగం అంటే అసలైన అర్థాన్ని తెలియజెప్పడానికి పాశ్చాత్య ప్రపంచానికి ప్రయాణించారు. జీవితానికి అసలైన అర్థాన్ని తెలుసుకోగోరే అన్వేషకులు అనుసరించవలసిన ‘కార్యాచరణ ప్రణాళిక’లో ధ్యానం విడదీయరాని భాగమని ఉద్ఘాటించిన ఆయన బోధన కాలానుగుణమైనది, కాలాతీతమైనది. జీవితపు అత్యున్నత లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారం లేదా దైవంతో ఏకత్వం సాధించడం అనేది ఆధ్యాత్మిక కృషి వల్లనే సాధ్యమవుతుందని యోగానంద ప్రతిపాదించారు. ఇక ఆయన గురువైన శ్రీయుక్తేశ్వర్ గిరి చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకోవాలి. “నువ్వు కనక ఇప్పుడు ఆధ్యాత్మిక కృషి చేస్తున్నట్లయితే ఇకముందు ప్రతీదీ మెరుగవుతుంది.”
యోగానంద “ఒక యోగి ఆత్మకథ“ గ్రంథంలో ప్రస్తావించిన అత్యున్నత సత్యాలను సాధించే దిశగా చేసే తన ప్రయత్నాలు ఫలించాలంటే ప్రతి భక్తుడూ అంచెలంచెలుగా సాధన చేయగలిగిన శాస్త్రీయమైన ఆధ్యాత్మిక ప్రక్రియ ఒకటి తప్పక అవసరమవుతుంది.
క్రియాయోగ యోగం యొక్క అత్యున్నత స్వరూపం. దైవ సంసర్గం సాధించడానికి మానవులకు తెలిసిన సర్వశ్రేష్ఠ మార్గం. క్రియాయోగంలో ఉన్న నిర్దిష్టమైన శాస్త్రీయ ప్రక్రియలు సాధకుడికి తన భౌతిక, మానసిక ఆరోగ్యాలను మెరుగుపరుచుకోవడానికే కాక ఆ ‘యోగి’ క్రమేపీ అసలైన శాంతి, ఆనందం — మనలోపల దైవసాన్నిధ్యపు ఉనికికి సూచనలు — కనుగొనగలిగేలా చేస్తాయి.
క్రియాయోగ మార్గం ప్రతి ఒక్కరూ అనుసరించదగినదని, అస్తిత్వపు అత్యున్నత తలానికి చేరుకొనే తిరుగులేని మార్గమని యోగానంద తన ప్రాచ్య, పాశ్చాత్య శిష్యులిరువురికీ వివరించారు. కొన్ని ప్రారంభ ప్రక్రియలకు ఆయన వివరణ ఇవ్వడంతో పాటు అత్యున్నత మెట్టయిన క్రియాయోగ ధ్యానమనే ద్వారానికి దారితీసే ‘జీవించడం ఎలా’ అనే తన తత్వబోధ కూడా వివరించారు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా క్రియాయోగాన్ని గురించి రెండుసార్లు గొప్పగా ప్రస్తావించాడు. క్రియాయోగాన్ని దాని లక్షణాలతో తమ జీవన విధానంగా స్వీకరించడానికి లక్షలాది మంది ప్రేరణ పొందారు. అయితే క్రియాయోగ వల్ల కలిగే లాభం దానిని శ్రద్ధగా అభ్యసించడంలో ఉందని శ్రీయుక్తేశ్వర్ గిరి గురువు లాహిరీ మహాశయులన్నారు. మన ఉనికికి పైనుండే ఉన్నత స్థాయిలలోకి ప్రవేశించడానికి స్వర్ణ ద్వారం క్రియాయోగ ప్రక్రియను క్రమం తప్పకుండా, సరైన విధంగా అభ్యసించడం వల్లనే వస్తాయి.
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) యోగానంద 1917 లో స్థాపించిన ఆధ్యాత్మిక సంస్థ. వై.ఎస్.ఎస్. యోగానంద విస్తారమైన రచనలపై గాఢమైన అంతర్దృష్టి ప్రసరింపచేసే విధంగా పుస్తకాలు, ముద్రిత పాఠాలు, ఇతరముల ద్వారా వ్యాప్తి చెందిస్తూ పనిచేస్తున్నన్నది. ఇటీవలి దశాబ్దాలలో క్రియాయోగ మార్గాన్ని అనుసరించే భక్తుల సంఖ్య భారతదేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ అపారంగా పెరిగింది.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- H-1B వీసాదారులకు ట్రంప్ సర్కార్ మరో షాక్.అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఉద్యోగం కోల్పోయిన H-1B వీసాదారులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించేలా అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం కొత్త ప్రతిపాదన…
- ఐదో రోజుకు చేరిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. గత రెండు రోజులుగా సభలో చోటుచేసుకున్న గందరగోళం, నాటకీయ పరిణామాల నేపథ్యంలో నేటి సమావేశాలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. స్పీకర్ పోడియంను ముట్టడించి నిరసన తెలిపినందుకు కేటీఆర్, హరీశ్‌రావు సహా 22…
- తమిళనాడు సీఎం విజయ్ పాలనపై స్టాలిన్ ఫైర్.తమిళనాడు రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య విమర్శలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై డీఎంకే నేత స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీని సినిమాలు తీసే ప్రదేశంగా మార్చేశారని ఆరోపించారు. పరిపాలనను కూడా సినిమా షూటింగ్‌లా నడుపుతున్నారని ఎద్దేవా…
- ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్‌తో జేఏసీ భేటీ.ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు జేఏసీ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, పెరుగుతున్న పని ఒత్తిడి, ఉద్యోగ సంఘాల నాయకులపై ఒత్తిడి వంటి అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆరు…
- ప్రతిపక్షాల తీరుపై మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్.శాసనమండలిలో ప్రతిపక్షాల తీరుపై మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇస్తోందని స్పష్టం చేశారు. భూముల కేటాయింపుల విషయంలోనూ పూర్తి వివరాలతో సమాధానాలు ఇస్తున్నామని…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.