రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎస్ఐ సస్పెన్షన్.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎస్ఐ సస్పెన్షన్

Advertisements

<p>రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ ఎస్ఐ తిరుపతయ్యపై సస్పెన్షన్ వేటు పడింది&period; డీజీపీ ఆదేశాలతో ఎస్ఐ తిరుపతయ్యపై ఈ చర్యలు తీసుకున్నారు&period; గంధంగూడ దగ్గర మనవరాలితో కారు డ్రైవింగ్ చేయించారని తిరుపతయ్యపై నార్సింగి పీఎస్‌లో కేసు నమోదైంది&period; ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకున్నారు ఉన్నతాదికారులు&period;<&sol;p>&NewLine;<p>చట్టాన్ని రక్షించాల్సిన పోలీస్ అధికారే బాధ్యతారహితంగా ప్రవర్తించారంటూ ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి&period; తన ఆరేళ్ల మనవరాలి చేతికి కారు స్టీరింగ్ ఇచ్చి రద్దీ రోడ్డుపై డ్రైవింగ్ చేయించడం వివాదాస్పదంగా మారింది&period; ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో&comma; ఉన్నతాధికారులు స్పందించి ఆయనపై కేసు నమోదు చేశారు&period;<&sol;p>&NewLine;<p>నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధంగూడ-బైరాగిగూడ రోడ్డుపై ఎస్సై తిరుపతయ్య మనవరాలితో కారు డ్రైవింగ్‌ చేయించారు&period; రద్దీగా ఉండే ఆ మార్గంలో ఒక చిన్నారి కారు నడుపుతుండటాన్ని గమనించిన తోటి వాహనదారులు షాక్‌కు గురయ్యారు&period; వారు కారును అడ్డుకుని&comma; పసిపిల్లల చేతికి స్టీరింగ్ ఇచ్చి ఇతరుల ప్రాణాలను ఎందుకు ప్రమాదంలోకి నెడుతున్నారని ఎస్సైను నిలదీశారు&period; కారు తన కంట్రోల్‌లోనే ఉందంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారాయన&period; దీంతో వాహనదారులకు&comma; ఆయనకు మధ్య వాగ్వాదం జరిగింది&period; ఈ తతంగాన్ని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది&period;<&sol;p>&NewLine;<p>ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో తీవ్రంగా స్పందించారు&period; మైనర్‌కు వాహనం ఇవ్వడం&comma; ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించడం వంటి నేరాల కింద ఎస్సై తిరుపతయ్యపై పలు సెక్షన్ల కింద నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు&period; తాజాగా డీజీపీ ఆదేశాలపై ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహానగర ప్రజా రవాణాపై HMDA ఫోకస్.

మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. మేమంతా కలిసే ఉంటాం.

పట్టభద్రులైన పది మంది విద్యార్థుల్ని, బంగారు పతకం సాధించిన దీపికను అభినందించిన విశాల్.