సీతారామపురం బిట్ -1 సచివాలయం పరిధిలో గురువారం ఉదయగిరి వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయనపై సీతారామపురం గ్రామ ప్రజలు వ్యతిరేక రాగం అందుకున్నారు. ప్రజలు అడుగడుగునా తమ సమస్యలను చెబుతూ నిలదీయడంతో రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ సందర్భంలో నాయకులు, ప్రజల మధ్య చిచ్చు రసాభాస జరిగింది. పోలీసుల చొరవతో గొడవ సద్దుమణిగింది. సీతారామపురంలోని రాజు గారి వీధి, వాల్మీకి కాలనీ, పడమటి వీధి లకు చెందిన మహిళలు అత్యధిక సంఖ్యలో తమ సమస్యలను తెలిపేందుకు రాజగోపాల్ రెడ్డి వద్దకు రాగా ఆయన చుట్టూ ఉన్న నాయకులు నిలువరించడంతో వివాదం చెలరేగింది. రాజగోపాల్ రెడ్డి ప్రజల సమస్యలు వినకుండానే గడపగడప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నంతో ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. సీతారామపురంలో గడపగడప కార్యక్రమం మొదలైన ఆదిలోనే మేకపాటి రాజగోపాల్ రెడ్డి పై వ్యతిరేకత రావడంతో తీవ్ర అసహనంతో తమ అనుకూలమైన కుటుంబాల వరకు వెళ్లి ఇతర సమస్యలను పట్టించుకోకుండా కార్యక్రమాన్ని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ముగిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి.
రాజగోపాల్ రెడ్డిని నిలదీసిన మహిళలు..
157
previous post