92
త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు దేశ రాజకీయాల్లో కీలకమైనవని సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు. ఛత్తీస్ గఢ్ తో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాబోయే పార్లమెంటు ఎన్నికలపై ప్రభావం చూపుతాయని ఆయన తెలిపారు. కేంద్రంలో పరిపాలించే దేశ నాయకుడ్ని ఈ ఎన్నికల ఫలితాలు సూచిస్తాయని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చి బీసీని ముఖ్యమంత్రి చేస్తానని ప్రదాని మోడీ చెప్పడం హాస్యాస్పదమని వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్ ఫెయిల్ అయిందని దానికి ఉదాహరణ నేనేనని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తామని చాడ వెంకటరెడ్డి తెలిపారు.