రుషికొండ నిర్మాణాలపై మరోసారి విచారణ

Rushikonda

Advertisements

&NewLine;<p>ఆంద్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు విశాఖలోని రుషికొండ చుట్టూ తిరుగుతున్నాయి&period; జగన్ ప్రభుత్వం విశాఖని పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటినుంచి రుషికొండ వివాదాలకొండగా మారిపోయింది&period; ప్రభుత్వం రుషికొండ చుట్టూ అక్రమ తవ్వకాలు చేపడుతుందని విపక్షాలు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే&period; అయితే దీనిపై అప్పట్లో విచారణ చేపట్టిన న్యాయస్థానం పరిశీలన కోసంఓ కమిటీని నియమించింది&period; ఆ కమిటీ రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలపై ఓ నివేదిక ఇచ్చింది&period; అనుమతికి మించి నిర్మాణాలు ఉన్నాయని ఆ కమిటీ పేర్కొంది&period; అయితే&comma; సీఎం జగన్ తాను విశాఖకు మకాం మార్చుతున్నానంటూ&comma; ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం ప్రత్యేక కమిటీ వేశారు&period; రుషికొండపై నూతనంగా చేపట్టిన నిర్మాణం బాగుందంటూ ఈ కమిటీ నివేదిక ఇచ్చేందుకు సన్నద్ధమైంది&period; దాంతో&comma; రుషికొండ ఉల్లంఘనలపై మొదట్లో పిటిషన్లు వేసిన వారు హైకోర్టులో మరో పిటిషన్ వేశారు&period; తాజాగా&comma; రుషికొండ నిర్మాణాలపై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది&period; తాము నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికపై మరోసారి విచారణ చేపట్టాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శిని ఆదేశించింది&period; రుషికొండపై ఉన్న నిర్మాణాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది&period; అంతేకాదు&comma; దీనిపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు ఆదేశాలు జారీ చేసింది&period; ఈ వ్యవహారంలో తదుపరి విచారణను నవంబరు 28కి వాయిదా వేసింది&period; రుషికొండపై 9&period;88 ఎకరాలకు అనుమతి ఇస్తే&comma; 20 ఎకరాల్లో తవ్వకాలు చేపట్టారని అప్పట్లో పిటిషన్లు వేశారు&period; విచారణ సందర్భంగా అనుమతికి మించి 3 ఎకరాలు ఎక్కువ తవ్వకాలు చేపట్టినట్టు ప్రభుత్వం అంగీకరించింది&period; అయితే&comma; అంతకంటే ఎక్కువే తవ్వకాలు చేపట్టారని పిటిషనర్ ఆరోపించడంతో&comma; కేంద్ర ప్రభుత్వం సర్వే చేపట్టింది&period; ఇప్పుడు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో&comma; రుషికొండలో కేంద్రం మరోసారి సర్వే చేపట్టే అవకాశాలున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..

కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి.టెక్ రవి విమర్శలు..

అమెరికాలో తెలుగు యువకుడు ఆత్మహత్య..