121
వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. 271 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు 47.2 ఓవర్లలో కష్టంగా మ్యాచ్‌ను ముగించింది. ఇక పాకిస్థాన్ సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బోల్తాపడింది. మొత్తం ఆరు మ్యాచుల్లో ఐదింట గెలిచిన దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలోకి దూసుకెళ్లింది. పాకిస్థాన్ బౌలర్లలో అఫ్రిది 3, మహ్మద్ వాసిమ్, రవూఫ్, ఉసామా మిర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.