Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home International హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు

హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు

by Rama
isreal - Hamas

ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ ఇటీవలే మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ సైతం హమాస్‌పై ఎదురుదాడికి దిగింది. గాజా లోని హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల కారణంగా హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్న 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని హమాస్‌ తాజాగా వెల్లడించింది. అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై మెరుపు దాడికి దిగిన హమాస్‌ మిలిటెంట్లు.. వందల మంది ప్రజలను బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. సుమారు 224 మందిని బందీలుగా చేసుకుంది. వీరిలో ఇజ్రాయెల్‌ పౌరులతోపాటు ఇతర దేశాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారు. అందులో ఇద్దరు ఇజ్రాయెల్‌ మహిళలతోపాటు ఇద్దరు అమెరికన్లను మానవతా కోణంలో హమాస్‌ విడుదల చేసింది. కాగా, తాజాగా ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో 50 మంది ప్రాణాలు కోల్పోయినట్లు హమాస్‌ ప్రకటించింది. ఇక ఇజ్రాయెల్‌ దాడులతో గాజా గజగజ వణుకుతోంది. హమాస్‌ స్తావరాలే లక్ష్యంగా వైమానిక, భూతల దాడులకు పాల్పడుతోంది. ఈ దాడుల్లో సుమారు 7 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గురువారం ఉత్తర గాజాలో హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా భూతల దాడులు చేపట్టింది. సుమారు 250 మంది స్థావరాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: