80
విజయవాడ ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు తలపెట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వందల సంఖ్యలో విద్యార్థి నాయకులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 32 మంది విద్యార్థుల బలిదానంతో ఏర్పడ్డ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి.