విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో ఉక్కు సత్యాగ్రహం పేరిట సత్యారెడ్డి దర్శకత్వంలో సినిమా ప్రమోషన్ శ్రీకాకుళం నగరంలో నిర్వహించారు. ఈ సినిమాలో పల్సర్ బైక్ ఝాన్సి హీరోయిన్ గా నటించిందని తెలిపారు. దర్శకుడు సత్యారెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది త్యాగ ధనుల కృషి ఫలితమే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అని పేర్కొన్నారు. ఈ చిత్రం చూసిన వారు మరలా అలనాటి రోజులు గుర్తు చేసుకుంటారని అన్నారు. ఈ సినిమాలో మొదటి భాగంలో భవిష్యత్తు తరాలకు, తెలుగు జాతికి జరుగుతున్న అన్యాయం తెలుస్తుందన్నారు. ఈ చిత్రంలో గద్దర్ ప్రధాన ప్రాత్ర పోషించారన్నారు. ఆయన నేడు మన మధ్యలో లేకపోయినా ఆయన ఆశీస్సులు ఉంటాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అసువులు బాసిన 32 మంది త్యాగమూర్తులకు ఈ చిత్రం అంకితం చేస్తున్నామన్నారు. విశాఖ ఉక్కు… ఆంద్రుల హక్కు అని నినాదించారు.
Visakha steal plant
విజయవాడ ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు తలపెట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వందల సంఖ్యలో విద్యార్థి నాయకులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 32 మంది విద్యార్థుల బలిదానంతో ఏర్పడ్డ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటం చేస్తామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు లోకనాథం హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ చేపట్టిన బస్సు యాత్ర మంగళవారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం చేరుకుంది .ఈ సందర్భంగా స్టీమర్ రోడ్ లో ప్రజా రక్షణ బేరీ పేరుతో నిర్వహించిన సభలో లోకనాథం మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి విధానాలకు తలొగ్గి జగన్ పాలన చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికలలో ఉద్యోగ కార్మికులకు ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలన్నీ నీటి మాటలగానే మిగిలాయని, నాలుగున్నర ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదంటూ. ఉన్న పరిశ్రమలే రాష్టం నుంచి తరలిపోతున్నాయని, దీనివల్ల నిరుద్యోగులకు ఉపాధి లేకుండా పోయిందని లోకనాథం జగన్ పాలనపై ఫైర్ అయ్యారు. ఈ సభలో రాష్ట్ర కమిటీ సభ్యులు మంతెన సీతారా జిల్లా కార్యదర్శి బలరాoలు పాల్గొన్నారు.




Total views : 180856