వైఎస్‌ జగన్‌పై మరోసారి తల్లి విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్‌..

Advertisements

<p>ఏపీ మాజీ సీఎం జగన్‌పై ఆయన తల్లి వైఎస్‌ విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు&period; నోటరీ ద్వారా ఆస్తుల పంపిణీ వివరాలను వెల్లడించిన ఆమె&&num;8230&semi; షర్మిలను సమర్థిస్తూ&comma; జగన్‌పై విమర్శలు చేశారు&period; వైఎస్ చనిపోయే నాటికి ఉన్నవన్నీ కుటుంబ ఆస్తులేనని&comma; పంపకాలు జరగలేదని స్పష్టం చేశారు&period; ఆస్తులు నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలని వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి భావించారని వెల్లడించారు&period; ఆస్తుల విషయంలో జగన్‌ తన మేనల్లుడు&comma; కోడలికి అన్యాయం చేశాడని అన్నారు&period; ఎప్పటికైనా ఈ విషయంలో న్యాయం చేస్తాడని తల్లిగా భావిస్తున్నానని విజయమ్మ తెలిపారు&period; అలాగే MOU లో షర్మిలకు రాసిన ప్రతీ ఆస్తి ఆమెకు చెందాల్సిందేనని&period;&period; అందుకే జగన్‌ కూడా దీన్ని రాశాడని చెప్పారు&period; అంతేకాదు నిజానికి ఆమెకు తక్కువే రాశాడని&&num;8230&semi; సరస్వతి సిమెంట్‌తో సహా MOU లో లేని యలహంక ల్యాండ్‌ కూడా షర్మిలదే అని విజయమ్మ స్పష్టం చేశారు&period; అలాగే జగన్‌ ఇచ్చాను అని చెబుతున్న డబ్బు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెండ్‌ మాత్రమే అన్నారు&period; ఆస్తుల పంపకం జరగలేదని మరోసారి స్పష్టం చేసిన విజయమ్మ&&num;8230&semi; నిజం ఏంటో దేవుడికి&comma; తన కొడుక్కి తెలుసని నోటరీ ద్వారా వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.