ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు కొనసాగుతాయ్ ..

Advertisements

<p>ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు&period; ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు కొనసాగుతాయని తెలిపారు&period; శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్‎లో విలేఖరులతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&period;&period; ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం చట్ట ప్రకారం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు&period; చట్ట ప్రకారం విచారణ పూర్తి కాకుండా నిందితులను అరెస్ట్ చేయలేమన్నారు&period; ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు కేంద్రం అనుమతించిందని తెలిపారు&period; ఫోన్ టాపింగ్ కేసులో క్లీన్ చిట్ వచ్చినట్లు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు&period; పంజాగుట్ట ప్రైవేట్ కేసు వ్యవహారంలో హరీష్ రావుకు క్లీన్ చిట్ వచ్చిందని&period;&period; కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో క్లీన్ చిట్ వచ్చినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని అన్నారు&period; బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 6 వేల ఫోన్లు ట్యాపింగ్ కు గురయ్యాయని తెలిపారు&period; ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు స్టేట్మెంట్ అధికారులు రికార్డ్ చేస్తున్నారని చెప్పారు&period; ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్‎ని సస్పెండ్ చేశామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..

కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..