శ్రీకాకుళం జిల్లాలో రాగోలు జెమ్స్ హొస్పిటల్ లో విషాదకర సంఘటన చోటు చెసుకుంది. టెక్కలిలో ప్రమాదానికి గురై జేమ్స్ హాస్పిటల్ కు చికిత్సకు వచ్చిన పున్నయ్య(31) మృతి చెందాడు. వైద్యం సరిగ్గా అందకే పున్నయ్య మృతి చెందాడని, వారం రోజులు చికిత్స చేసిన తర్వాత డిశ్చార్జ్ ఇచ్చి మళ్లీ ఆపరేషన్ చేయడం వల్లే పున్నయ్య చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుని బంధువులతో జేమ్స్ హాస్పిటల్ డాక్టర్లు బేరానికి దిగిన దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే పున్నయ్య మృతి చెందాడని హాస్పిటల్ ముందు మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు. పోలీసులు సకాలంలో హాస్పిటల్ కి చేరుకొని పరిస్థితులను అదుపు చేశారు. తమకు న్యాయం జరగకపోతే ఎంతవరకైనా వెళ్దామని మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు. పున్నయ్య బ్రెయిన్ డెడ్ అయ్యాడని డాక్టర్లు చెబుతున్నారు.
Read Also..