Wednesday, March 11, 2026
News Navigation
Home Business డీఎస్సీ నోటిఫికేషన్‌ పై హైకోర్టులో విచారణ

డీఎస్సీ నోటిఫికేషన్‌ పై హైకోర్టులో విచారణ

by Satya
Inquiry in High Court on DSC notification

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ సుమతి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఎస్‌జీటీ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదించారు. బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వలన పది లక్షల మంది డీఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. దేశ అత్యున్నత న్యాయస్థానం, ఎన్సీటీఈ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందని పిటిషనర్ వాదనలు వినిపించారు. తప్పులతడకగా నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాదిమంది జీవితాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

సుప్రీం కోర్టు తీర్పు స్పష్టంగా ఉన్నా బీఎడ్ అభ్యర్థులను ఎలా అనుమతించారని ధర్మాసనం ప్రశ్నించింది. సుప్రీం కోర్టు తీర్పు మీకు వర్తించదా అని వ్యాఖ్యానించింది. ఒక్కసారి సుప్రీం కోర్టు ఆదేశాలు ఇస్తే అవి దేశ వ్యాప్తంగా అమలు కావలసిందే కదా అని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రధాన న్యాయమూర్తి సెలవు కారణంగా మంగళవారం ఈ పిటిషన్‌ను విచరిస్తామని హైకోర్టు వెల్లడించారు.

Read Also..

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • శ్రీశైల క్షేత్రంలో ఉగాది ఉత్సవాలకు ఏర్పాట్లు.
    నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో ఈనెల 16 నుండి 20 వరకు ఉగాది ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరావు సిబ్బందితో సమీక్ష జరిపారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా గతంలో వలే భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం…
  • నేపాల్ ఎన్నికల్లో కొత్త పార్టీ ప్రభంజనం
    నేపాల్ రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రభంజనం సృష్టించింది. నేపాల్ ఎన్నికలు ఆ దేశ రాజకీయాలను సమూలంగా మార్చేశాయి. కేవలం మూడున్నరేళ్ల క్రితం ఆవిర్భవించిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ పార్లమెంట్ ఎన్నికల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. దశాబ్దాలుగా తమను శాసిస్తున్న హేమాహేమీలను…
  • పశ్చిమాసియా ఘర్షణలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.
    పశ్చిమాసియా ఘర్షణలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. దాంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. తాజాగా బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్ల మార్క్‌ దాటేసింది. నాలుగేళ్లలో ఒక బ్యారెల్ ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అమెరికా…

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.