Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Crime అమలాపురంలో తీవ్ర కలకలం..

అమలాపురంలో తీవ్ర కలకలం..

by CVR NEWS
అమలాపురంలో తీవ్ర కలకలం..

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మైనర్ బాలిక అబార్షన్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. అమలాపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చట్టవిరుద్ధంగా జరిగిన ఈ అబార్షన్ ఉదంతంపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. జిల్లా కలెక్టర్ సంచలన ఆదేశాలతో.. అమలాపురం ‘ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్’లో అధికారుల ప్రత్యేక బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది.ఆర్డీవో మమ్మీ, డీఎంహెచ్‌వో దుర్గారావు, బాల హక్కుల కమిషన్ సభ్యురాలు నాగా మానస నేతృత్వంలోని ఉన్నతాధికారుల టీమ్ ఆసుపత్రిని జల్లెడ పడుతోంది. మైనర్ బాలికకు అబార్షన్ చేసిన వ్యవహారంలో హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ లంకె శిరీషను అధికారులు గదిలో వేసి సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రి రికార్డులు, నిబంధనల ఉల్లంఘనలపై ఆరా తీస్తున్నారు.మరోవైపు ఈ ఘటనపై బాల హక్కుల కమిషన్ సభ్యురాలు నాగా మానస తీవ్రంగా స్పందించారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జనాభా పెరగాలని, పిల్లలను ఎక్కువ మందిని కనాలని పిలుపునిస్తుంటే.. ఇక్కడ మైనర్లకు అక్రమంగా అబార్షన్లు చేయడం అత్యంత దారుణమన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా సరే.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల అనంతరం నివేదికను కలెక్టర్‌కు సమర్పించనున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: