Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Politics తెలుగు రాష్ట్రాల ఆవిర్భావానికి 12 ఏళ్లు పూర్తికావడం చారిత్రాత్మక ఘట్టం…

తెలుగు రాష్ట్రాల ఆవిర్భావానికి 12 ఏళ్లు పూర్తికావడం చారిత్రాత్మక ఘట్టం…

by CVR NEWS
తెలుగు రాష్ట్రాల ఆవిర్భావానికి 12 ఏళ్లు పూర్తికావడం చారిత్రాత్మక ఘట్టం

తెలుగు రాష్ట్రాల ఆవిర్భావానికి 12 ఏళ్లు పూర్తికావడం ఓ చారిత్రక ఘట్టమని రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ, తెలుగు జాతి హృదయం ఎప్పటికీ ఒకటే. పరిపాలనా హద్దులు మారినప్పటికీ, మన సంస్కృతి, మన గౌరవం ఎప్పటికీ తగ్గదని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రతి తెలుగు కుటుంబానికి నాణ్యమైన వైద్యం, మెరుగైన జీవన ప్రమాణాలు అందేలా చేయడం లక్ష్యమన్నారు. హైదరాబాద్ మరింత అంతర్జాతీయ ఖ్యాతిని గడించాలనీ.. అమరావతి నూతన భారతానికి ప్రతీకగా ప్రపంచ స్థాయి రాజధానిగా అవతరించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
వికసిత్ భారత్-2047 సాధనలో తెలుగు రాష్ట్రాలు మార్గదర్శక శక్తులుగా ఎదగాలని పిలుపు ఇచ్చారు. తెలుగు జాతి ఐక్యత, కృషి, జ్ఞానం, సంకల్పమే మన భవిష్యత్తు విజయాలకు పునాది అన్నారు. తెలుగు గౌరవాన్ని, సంస్కృతిని, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: