Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home Latest News ఈ తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం – పవన్‌..

ఈ తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం – పవన్‌..

by CVR NEWS
ఈ తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం - పవన్‌

తెలంగాణలో తనను అడుగుపెట్టనివ్వమని, తిరగనివ్వమని హెచ్చరికలు చేస్తున్న వారిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ వారి అయ్య జాగీరా అంటూ మండిపడ్డారు. ఎవరు ఏం అన్నా తన గుండెల్లో తెలంగాణ ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణపై తనకు ప్రేమ ఈ రోజు వచ్చింది కాదని.. ఎప్పటినుంచో ఉందని తేల్చి చెప్పారు. హైదరాబాద్ , జూబ్లీహిల్స్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. దేశంలో అంతర్భాగం తెలంగాణ అని స్పష్టం చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన వారే.. పదవుల్లో ఉన్నారని.. ఎమ్మెల్యేలు అయ్యారన్న పవన్‌ కల్యాణ్..ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. ఇక్కడ ఏమైనా చేస్తే తాను సీఎం అయిపోతానా? అని ప్రశ్నించారు. తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెలంగాణలో పోటీ చేస్తామని ఆయన కుండ బద్దలు కొట్టారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

023333
Total views : 141771

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.