Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home Latest News ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందన.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందన.

by CVR NEWS
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ భూమి పుత్రుల జాగీరేనని, ఈ నేల కోసం పోరాడిన ప్రజల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని స్పష్టం చేశారు.తెలంగాణ ఉద్యమం వేలాది మంది త్యాగాలు, పోరాటాల ఫలితంగా సాధించుకున్న రాష్ట్రం అని పేర్కొన్న కేటీఆర్.. ప్రాంతీయవాదాన్ని ఉగ్రవాదంతో పోల్చడం సరైన వ్యాఖ్య కాదన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన ఉద్యమం కూడా ప్రాంతీయ భావనలో భాగమే కాదా అని ప్రశ్నించారు.ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా దేశంలో ఎక్కడైనా పోటీ చేసే హక్కు రాజ్యాంగం కల్పించిందని, జనసేనను తెలంగాణలో ఎవరూ అడ్డుకోవడం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. 2018, 2023 ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేసిందని గుర్తు చేశారు.పవన్ కళ్యాణ్‌ను ఉప ముఖ్యమంత్రిగా, నటుడిగా గౌరవిస్తామని, కానీ తెలంగాణ ప్రజల మనోభావాలు, ఉద్యమ చరిత్ర, త్యాగాలను గౌరవిస్తూ మాట్లాడాలని సూచించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

023335
Total views : 141774

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.