Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home National ఇవాళ కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణ స్వీకారం..

ఇవాళ కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణ స్వీకారం..

by CVR NEWS
ఇవాళ కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణ స్వీకారం

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన డీకే శివకుమార్ కర్ణాటక సీఎంగా ఇవాళ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లిన ఆయన మంత్రివర్గ కూర్పుపై అధిష్ఠానంతో చర్చలు జరిపారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో సిద్ధరామయ్య, డీకేలు భేటీ అయ్యారు. ఈ క్రమంలో నేడు సీఎంతో పాటు 10 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే తొలి విడతలో ఎవరు ఉంటారనేది ఖరారైనట్టు వెల్లడించాయి. మరో వారం పది రోజుల వ్యవధిలోనే క్యాబినెట్ విస్తరణ కూడా ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు హాజరుకానున్నారు. సాయంత్రం 4:05 గంటలకు కర్ణాటక శాసనసభ ప్రాంగణంలో లేదా లోక్ భవన్‌లో ఈ చారిత్రాత్మక కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, కార్యక్రమం సజావుగా సాగేలా చూడటం కోసం కర్ణాటక ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 3న విధాన సౌధ, వికాస సౌధ, బహుళ అంతస్తుల భవనాలలో పనిచేసే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి హాఫ్ డే సెలవు ప్రకటిస్తూ గవర్నర్ పేరు మీద సిబ్బంది, పరిపాలనా సంస్కరణల శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: