Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Crime అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం

అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం

by CVR NEWS

మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

మైత్రీవనం సమీపంలో మెయిన్ రోడ్డుపైనే ఉన్న KSR ఫ్యాషన్స్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. క్షణాల్లోనే మంటలు బిల్డింగ్ అంతటా వ్యాపించాయి. సమీప దుకాణాలకు కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. ఈ భారీ అగ్ని ప్రమాదంతో అమీర్ పేట్ మొత్తం దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. పొగ దట్టంగా కమ్మేయడంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వచ్చే పోయే మెట్రో రైళ్లను కూడా పొగ కమ్మేసింది.
బిల్డింగ్ మొత్తం దట్టమైన మంటలు వ్యాపించాయి. భగభగ మండే మంటలతో దగ్గరకు వెళ్లటానికి సైతం సాహసించలేకపోతున్నారు స్థానికులు. బిల్డింగ్ మొత్తం మంటల్లో కాలిపోతున్న విజువల్స్ చుట్టు పక్కల వాళ్లను భయాందోళనలకు గురి చేస్తుంది.

మూడు అంతస్తుల ఈ బిల్డింగ్ మంటల్లో చిక్కుకుంది. ఈ బిల్డింగ్ చుట్టూ హోటళ్లు, రెస్టారెంట్లు, కంప్యూటర్ షాపులు, సెల్ ఫోన్ షాపులు ఇలా చాలా షాపులు ఉన్నాయి. మండే ఎండలకు మంటలు చుట్టుపక్కల ఉన్న షాపులకు వ్యాపిస్తున్నాయి. మంటల ధాటికి చుట్టుపక్కల ఉన్న వ్యాపారులు అందరూ వారి వారి షాపుల్లోని విలువైన వస్తువులను బయటకు తీసుకొచ్చి.. అక్కడి నుంచి పరుగులు తీస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. KSR ఫ్యాషన్స్ షాపులో అన్నీ దుస్తులు కావటంతో మంటల స్థాయిలో తీవ్రంగా ఉందంటున్నారు అధికారులు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

020212
Total views : 92464

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.