అల్లూరి జిల్లాలో విష జ్వరాల విజృంభణ దారుణం సృష్టిస్తోంది. దారకొండ, సీలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్కరోజే ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . రోజుకి 40 నుంచి 50 మంది పేషెంట్లు ఓపి కింద వస్తున్నారు .కొంతమంది ఆస్పత్రిలో చేరుతున్నారు .దింతో హాస్పిటల్లో కేవలం ఆరు మంచాలు మాత్రమే ఉండటం పరిస్థితిని మరింత కష్టతరం చేస్తుంది . అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు ఒక మంచానికి ఇద్దరు , ముగ్గురిని పడేసి సేవలు అందించాల్సి వస్తోంది. మెరుగైన వైద్యం కోసం చింతపల్లి ఏరియా హాస్పిటల్ కు వెళ్లాలంటే 70 కిలోమీటర్ల దూరం. దింతో గ్రామస్తులకు ఇది పెద్ద ఇబ్బందిగా మారింది . స్థానికులు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని, ఈ గిరిజన ప్రాంతానికి అన్ని వసతులతో పద్ధతిగా వైద్యం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
సీలేరు, దారకొండ ప్రాథమిక కేంద్రాల్లో వైద్య సదుపాయాల లోపం గిరిజనుల జీవితాన్ని కష్టతరం చేస్తోంది. హాస్పిటల్లో సరైన సిబ్బంది లేకపోవడం, ఒక్క డాక్టర్ మాత్రమే ఉండటం, అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్ల కోసం సరైన వైద్యం అందకపోవడం ప్రధాన సమస్యగా మారింది. పేషెంట్లు అంబులెన్స్ కోసం గంటల తరబడి వేచిచూడాల్సి న పరిస్థితి నెలకొంది .దింతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వైద్యులు నియమించాలని , సదుపాయాలను పెంచాలని , ప్రతి పేషెంట్‌కు తక్షణ సేవ అందించాలని స్థానికులు కోరుతున్నారు . ఇలాంటి వాటి పై తక్షణం చర్యలు తీసుకుంటే, విష జ్వర ప్రభావాన్ని తగ్గించడంతో పాటు గ్రామీణుల ఆరోగ్య భద్రతను కాపాడవచ్చని నిపుణులు అంటున్నారు .





Total views : 92310