Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Crime వికారాబాద్ జిల్లా, యాలాల్ మండలం, కోకట్ గ్రామ సమీపంలో విషాదం.

వికారాబాద్ జిల్లా, యాలాల్ మండలం, కోకట్ గ్రామ సమీపంలో విషాదం.

by CVR NEWS
crime

వికారాబాద్ జిల్లా యాలాల్ విహారయాత్ర కోసం వెళ్లిన కుటుంబంలో విషాదం నెలకొంది. సరదాగా ఈత కోట్టేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు నీటమునిగారు. ఈ క్రమంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు గల్లంతు అయ్యారు.
విషయం తెలుసుకున్న పోలీసులు గల్లంతైన వ్యక్తి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాథమిక సమాచారం మేరకు తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరుకు చెందిన మోయిజ్‌ సంగారెడ్డి జిల్లా బస్తాపూర్ ప్రాంతానికి చెందిన అతని బందువు రహమత్‌ వారి కుటుంబ సభ్యులతో కలిసి యాలాల మండలం కోకట్ గ్రామ సమీపంలోని కాగ్నానది వద్దకు సరదా కోసం వెళ్లారు. అక్కడ మోయిజ్‌, రహమత్‌లు సరదాగా ఈత కొట్టేందుకని నదిలోకి దిగారు. కొద్ది సేపటికి ఇద్దరు నీటిలో మునిగిపోయారు. ఒకరినొకరు కాపాడుకునే క్రమంలో మోయిజ్‌ నీటిలో మునిగి మృతి చెందగా.. రహమత్‌ వాగులో గల్లంతు అయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానికులు యాలాల పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మోయిజ్‌ మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. రహమత్‌ ఆచూకి తెలియకపోవడంతో పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

020069
Total views : 92183

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.