ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చి కక్షపూరిత రాజకీయాలకు పెద్దపీట వేస్తూ పరిపాలన కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. పుట్టపర్తిలో పురందేశ్వరి అధ్యక్షతన పోలింగ్ బూత్ మరియు శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశం జరిగింది. పురందేశ్వరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు విధానపరమైన లోపాలను ఎత్తిచూపితే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టిడిపి కోవర్టు అంటారా అంటూ ప్రశ్నించారు .రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాల గురించి ప్రశ్నించకూడదా ప్రశ్నిస్తే
ప్రతిపక్షాల గొంతు నొక్కుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అక్రమాలపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశామన్నారు. నిరుపేదల ఇళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం 18 లక్షల ఇళ్లు కేటాయిస్తే ఎన్ని ఇళ్లు నిర్మించారో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ప్రస్తుతం బిజెపి జనసేన పార్టీ పొత్తులో కొనసాగుతున్నామని స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం – పురందేశ్వరి
139
previous post