శాసనసభ ఎన్నికల తనిఖీల్లో భాగంగా పట్టుబడిన నగదు, మద్యం, ఆభరణాలు, కానుకల విలువ మొత్తం రూ.300 కోట్ల మార్క్ దాటింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన అక్టోబరు 9న నుంచి ఇప్పటి వరకు తనిఖీల్లో పట్టుబడిన సొత్తు విలువ రూ.307.2కోట్లకు పైగా ఉన్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటించారు. గడచిన 24గంటల్లో రూ.9.69కోట్ల నగదు పట్టుబడగా, ఇప్పటి వరకు పట్టుబడిన మొత్తం నగదు రూ.105.58 కోట్లు అని వెల్లడించారు. రూ.1.35లక్షల విలువైన మద్యం పట్టుబడిందని తెలిపారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సరకు విలువ రూ.13.58 కోట్లు అని తెలిపారు. 24 గంటల్లో రూ.72 లక్షల విలువైన 232 కిలోల గంజాయి పట్టుబడిందని తెలిపారు. గడచిన 24గంటల్లో రూ.3.81 కోట్ల విలువైన బంగారం, 894 కిలోల వెండి, 190 క్యారెట్ల వజ్రాలు, 5గ్రాముల ప్లాటినం స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటి విలువ రూ.145.67 కోట్లు. వీటితో పాటు రూ.26.93 కోట్ల విలువైన ఇతర కానుకలు పట్టుబడ్డాయని తెలిపారు.
శాసనసభ ఎన్నికల తనిఖీల్లో పట్టుబడిన నగదు
95
previous post