శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు..

Srinivas Reddy

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్ నేత&comma; పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్టుగానే జరిగింది&period; ఐటీ&comma; ఈడీ అధికారులు పొంగులేటి నివాసంలో సోదాలు చేస్తున్నారు&period; గురువారం వేకువజామున 3 గంటల నుంచే ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసాల్లో సోదాలు మొదలయ్యాయి&period; మొత్తం 8 వాహనాల్లో అధికారులు పొంగులేటి ఇంటికి చేరుకున్నారు&period; మొదటి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు&period; ఆ తర్వాత తనిఖీలు మొదలుపెట్టారని తెలుస్తోంది&period; ఖమ్మంతోపాటు హైదరాబాద్‌లోని నందగిరిహిల్స్‌‌లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి&period; ఇదిలావుండగా ఐటీ దాడులను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందుగానే ఊహించారు&period; బీజేపీ&comma; బీఆర్ఎస్ ప్రోద్బలంతో తన నివాసంపై&comma; తన కుంటుంబ సభ్యుల ఇళ్లలో&comma; తన అనుచరుల ఇళ్లలో ఐటీ సోదాలు జరగబోతున్నాయని బుధవారం మీడియా సమావేశంలో పొంగులేటి అన్నారు&period; రోజుల వ్యవధిలో ఇది చూడబోతున్నారని వ్యాఖ్యానించారు&period; ఆయన మాట్లాడిన గంటల వ్యవధిలోనే ఈ దాడులు జరగడం గమనార్హం&period; కాగా గురువారం ఆయన నామినేషన్ వేయాలని భావించారు&period; ఐటీ&comma; ఈడీ దాడుల నేపథ్యంలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయా అనేది వేచిచూడాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..