రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరాం రాథోడ్ నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ప్రవళిక హైదరాబాద్ చిక్కడపల్లిలోని హాస్టల్ గదిలో ఈ నెల 13న బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై విద్యార్థులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆందోళనలకు దిగారు. గ్రూప్స్ పరీక్షల వాయిదా కారణంగా మానసిక ఒత్తిడితో ఆమె చనిపోయిందంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. శివరాం రాథోడ్ వ్యవహారం వెలుగుచూసింది. మృతురాలి సెల్‌ఫోన్ డేటాను పరిశీలించిన దర్యాప్తు అధికారులు ఆమెతో శివరాం చేసిన వాట్సప్ సందేశాలను గుర్తించారు. దీంతో అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే శివరాం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు.
116
previous post