115
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కార్నర్ మీటింగ్ లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఒక్కకేసీఆర్ ని ఓడించడానికి ఢిల్లీ, కర్ణాటక నుంచి గుంపులు గుంపులుగా వస్తున్నారు. కానీ సింహం సింగిల్ గానే వస్తుంది. 2014 నుంచి కేసీఆర్ సింగిల్ గానే పోటీ చేస్తున్నాడు. ఢిల్లీ నుంచి కాదు కదా ఎక్కడి నుంచి అయినా రండి. నవంబర్ 30 నాడు తెలంగాణ దమ్మెందో చూపిస్తాం. ఢిల్లీ దొరలకు తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలకు మధ్య జరిగే పోరాటం ఇది. కాంగ్రెస్ కు గాని బీజేపీకి గాని తెలంగాణలో సత్తా ఉన్న నాయకులు లేరు. వాళ్లు బయటి రాష్ట్రాల నుంచి నాయకులను తెచ్చుకుంటున్నారు. షాద్ నగర్ నియోజకవర్గానికి రాబోయే కాలంలో ఐటీ హబ్ తీసుకువస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.