సీపీఐ నేత రామకృష్ణ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. తనకు నెల్లూరులో మూడు ఓట్లు ఉన్నాయంటూ గత రెండు రోజులుగా సిపిఐ రామకృష్ణతో పాటు పలువురు టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణలను అనిల్ కుమార్ యాదవ్ ఖండించారు.నెల్లూరు లో ఆయన మీడియాతో మాట్లాడారు. తన ఇంటి పేరు మీద ఉన్న ఓటును తప్ప మిగిలిన అన్నింటిని తొలగించాలని గతంలోనే ఎలక్షన్ కమిషన్ కు డిక్లరేషన్ ఇచ్చానని తెలిపారు. ఆ డిక్లరేషన్ ను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. సిపిఐ, టిడిపి నేతల వలె తాను ప్రజలలో పబ్లిసిటీ లేని వ్యక్తిని కానని అన్నారు. తాను రెండవ ఓటు వేస్తేనే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అవుతుందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. అనిల్ కు మూడు ఓట్లు ఉన్నాయంటు ఫేస్బుక్ అఫీషియల్ పేజీలో పెట్టిన నారాయణ..ఆయన అవినీతి బాగోతాలను కూడా పెట్టుకుంటే బాగుంటుందని విమర్శించారు.
సీపీఐ నేత రామకృష్ణ చేసిన ఆరోపణలపై అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్…
134
previous post