హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు..

Advertisements

<p>పవిత్ర రంజాన్ మాసంలో ఇవాళ చివరి శుక్రవారం&period; ముస్లింలు జరుపుకునే జమ్మాత్-ఉల్-విదా ప్రార్థనల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు నగరంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు&period; చారిత్రాత్మక మక్కా మసీదుతో పాటు సికింద్రాబాద్‌లోని జామా మసీదు పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నియంత్రించనున్నట్లు ప్రకటించారు&period; చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్ని రకాల వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు&period; చార్మినార్ నుంచి మదీనా&comma; ముర్గీ చౌక్&comma; శాలిబండ వైపు వెళ్లే ప్రధాన రహదారులను పూర్తిగా మూసివేస్తున్నట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ తెలిపారు&period; నయాపూల్ నుంచి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను మదీనా జంక్షన్ వద్ద సిటీ కాలేజీ వైపు మళ్లిస్తారు&period; శాలిబండ&comma; నాగులచింత వైపు నుంచి వచ్చే వాహనాలను హిమ్మత్‌పురా జంక్షన్ వద్ద హరిబౌలి వైపు పంపిస్తారు&period; చౌక్ మైదాన్ ఖాన్ నుంచి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను కోట్లా అలీజా వైపు మళ్లిస్తారు&period; ఈ ఆంక్షల నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను అఫ్జల్‌గంజ్ బస్టాప్ వద్దే నిలిపివేయనున్నారు&period; ప్రార్థనల కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం సౌత్ జోన్ పరిధిలో ఆరు చోట్ల ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కల్పించారు&period; అదేవిధంగా&comma; సికింద్రాబాద్‌లోని జామా మసీదు వద్ద కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి&period; సుభాష్ రోడ్డును మూసివేసి&comma; రాణిగంజ్&comma; ప్యారడైజ్ వైపు ట్రాఫిక్‌ను మళ్లిస్తారు&period; జమ్మాత్-ఉల్-విదా సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఐచ్ఛిక సెలవు ప్రకటించింది&period; ప్రయాణికులు ఈ మార్పులను గమనించి&comma; ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.

కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.