59
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా, పెదవేగి మండలం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి డీ.కమలేష్(14) అర్ధరాత్రి చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి పంచనామాల నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి కమలేష్ స్వగ్రామం భీమడోలు మండలం అర్జ వారి గూడెం. విద్యార్థి చనిపోవడానికి గల కారణాలు ఆర్డిఓ ఎస్కే కాజా వలి ప్రిన్సిపాల్ , విద్యార్థులను అడిగి వివరాలు రాబడుతున్నారు