స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (Special Intelligence Branch)..
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు(Dugyala Praneet Rao)కు నాంపల్లి కోర్టు(Nampally Court) 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పంజాగుట్ట పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail)కు తరలించారు. ఎస్ఐబీలో కీలక సమాచారాన్ని ధ్వంసం చేశారనే ఆరోపణలపై పంజాగుట్ట పోలీసులు(Panjagutta Police) ప్రణీత్‌రావు(Praneet Rao)పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అంతర్గత విచారణలో ఆధారాలు లభ్యం కావడంతో ఈనెల 4నే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ సమయంలో ఆయన సిరిసిల్ల డీసీఆర్బీ డీఎస్పీగా ఉన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
సస్పెన్షన్ అమల్లో ఉన్న కాలంలో సిరిసిల్ల హెడ్‌క్వార్టర్‌ను విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొనడంతో ఆయన కుటుంబంతోసహా అక్కడే ఉంటున్నారు. మంగళవారం రాత్రి సిరిసిల్లలో ప్రణీత్‌రావు(Praneet Rao)ను అదుపులోకి తీసుకొని హైదరాబాద్(Hyderabad)కు తరలించారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అరెస్టు చేసి.. జ్యుడీషియల్ కస్టడీ కోరుతూ న్యాయస్థానంలో హాజరుపరిచారు. మరోవైపు కేసు దర్యాప్తు కోసం జూబ్లీహిల్స్ ఏసీబీ వెంకటగిరి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఇది చదవండి: సెప్టెంబర్ లో హైదరాబాద్ విమోచన దినం…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి