1912 నాటి టైటానిక్ లైఫ్ జాకెట్..

Advertisements

<p>సముద్ర గర్భంలో కలిసిపోయి దశాబ్దాలు గడుస్తున్నా&period;&period; టైటానిక్ అంటే ప్రపంచానికి ఇప్పటికీ అదే క్రేజ్&period; ఆ మహా విషాదానికి సంబంధించిన ఏ చిన్న వస్తువు దొరికినా&comma; అది చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది&period; తాజాగా&comma; టైటానిక్ ప్రమాదం నుంచి ఒక ప్రాణాన్ని కాపాడిన లైఫ్ జాకెట్&comma; వేలంలో రికార్డు సృష్టించింది&period; లండన్‌లో జరిగిన చారిత్రక వస్తువుల వేలంలో ఈ లైఫ్ జాకెట్ అక్షరాలా 9 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది&period; ఇంగ్లాండ్‌కు చెందిన ప్రసిద్ధ &&num;8216&semi;హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్&&num;8217&semi; సంస్థ నిర్వహించిన ఈ వేలంలో&comma; ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేకర్తలు పోటీ పడ్డారు&period;<&sol;p>&NewLine;<p>నిజానికి ఈ జాకెట్ గరిష్టంగా 3&period;5 లక్షల పౌండ్లు పలుకుతుందని నిర్వాహకులు అంచనా వేశారు&period; కానీ&comma; అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 6&comma;70&comma;000 పౌండ్ల à°§à°° పలికింది&period; దీనికి పన్నులు&comma; ఫీజులు అన్నీ కలిపితే సుమారు 9 కోట్ల రూపాయలకు చేరింది&period; ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ ద్వారా వేలంలో పాల్గొని దీన్ని దక్కించుకున్నారు&period; ఇంతటి భారీ à°§à°° పలకడానికి ఈ జాకెట్ వెనుక ఉన్న కథే కారణం&period; ఇది టైటానిక్ నౌకలో ప్రయాణించిన &&num;8216&semi;లారా మాబెల్ ఫ్రాంకటెల్లి&&num;8217&semi; అనే మహిళకు చెందినది&period; ఆమె అప్పటి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ లూసీ డఫ్ గోర్డాన్ వద్ద సెక్రటరీగా పనిచేసేవారు&period;<&sol;p>&NewLine;<p>1912 ఏప్రిల్ 14 రాత్రి టైటానిక్ మంచుకొండను ఢీకొన్నప్పుడు&period;&period; లారా మాబెల్ తన యజమానులతో కలిసి &&num;8216&semi;లైఫ్ బోట్ నంబర్ 1&&num;8217&semi; ద్వారా సురక్షితంగా బయటపడ్డారు&period; ఆమె ప్రాణాలను కాపాడిన ఆ జాకెట్&comma; క్యాన్వాస్ వస్త్రం&comma; కార్క్ ముక్కలతో తయారైంది&period; ఈ జాకెట్‌కు ఉన్న మరో విశిష్టత ఏమిటంటే&period;&period; దీనిపై లారా మాబెల్‌తో పాటు&comma; ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన మరో ఎనిమిది మంది వ్యక్తుల సంతకాలు కూడా ఉన్నాయి&period; అంటే&comma; ఆ భయానక రాత్రికి ఇది తొమ్మిది మంది సంతకాలతో కూడిన ఒక సజీవ సాక్ష్యం&period;<&sol;p>&NewLine;<p>వంద ఏళ్లకు పైగా కాలం గడిచినా&comma; ఉప్పు నీటిలో తడిసినా ఈ జాకెట్ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం&period; అందుకే చారిత్రక పరిశోధకులు&comma; సేకర్తలు దీనిని దక్కించుకోవడానికి అత్యంత ఆసక్తి కనబరిచారు&period; కేవలం లైఫ్ జాకెట్ మాత్రమే కాదు&period;&period; అదే వేలంలో టైటానిక్ లైఫ్ బోట్‌కు చెందిన ఒక సీటు కుషన్ కూడా నాలుగున్నర కోట్ల రూపాయలకు పైగా à°§à°° పలికింది&period; ఎన్ని ఏళ్లు గడిచినా &&num;8216&semi;అన్ సింకబుల్&&num;8217&semi; షిప్ టైటానిక్ జ్ఞాపకాలు మాత్రం నేటికీ కోట్లు పలుకుతూనే ఉన్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.