టీఎస్ఆర్టీసీ(TSRTC)లోకి ఎలక్ట్రిక్ బస్సులు..
హైదరాబాద్(Hyderabad)లో టీఎస్ఆర్టీసీలోకి అదనంగా 22 ఎలక్ట్రిక్ బస్సులు వచ్చాయి. ఈ 22 ఎలక్ట్రిక్ బస్సులను టీఎస్ఆర్టీసీ(TSRTC) అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎలక్ట్రిక్ బస్సులను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రులు పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy Venkat Reddy) జెండా ఊపి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఫిబ్రవరి నెలలో 100 కొత్త బస్సులను టీఎస్ఆర్టీసీ(TSRTC) అందుబాటులోకి తీసుకువచ్చింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇందులో మహాలక్ష్మి పథకం కోసం 90 ఎక్స్ప్రెస్ బస్సులను కేటాయించగా, హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో తొలిసారి 10 ఏసీ రాజధాని సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ బస్సులు అన్ని కిక్కిరిపోతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రప్రభుత్వం ఇలా కొత్త బస్సులను ప్రారంభించడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇది చదవండి: మెడికల్ షాపుల్లో అధికారులు దాడులు..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి