Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Latest News అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్…

అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్…

by Prakash
District Collector inspected the development works

హుస్నాబాద్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు. పట్టణంలోని ఎల్లమ్మ చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎల్లమ్మ చెరువు విస్తీర్ణo వివరాలను ఇరిగేషన్ డిఇ రాములును అడిగి తెలుసుకున్నారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయుటకు ఎస్టిమేట్ చేయాలని ఇరిగేషన్, టూరిజం డెవలప్మెంట్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనమును మరియు నూతనంగా నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనంను పరిశీలించారు. ఏయే కోర్సుల్లో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారో, ఎంత మంది విద్యార్థులు ఉన్నారని కళాశాల ప్రిన్సిపాల్ బిక్షపతిని అడిగి తెలుసుకున్నారు. నూతన భవనంలోకి షిఫ్ట్ కావడానికి అవసరమైన ఎలక్ట్రిసిటీ, త్రాగునీరు తదితర చిన్నచిన్న పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. అనంతరం మెడికల్ కాలేజ్ నిర్మాణానికి హనుమకొండ దారిలో గుర్తించిన 30 ఎకరాల భూమిని పరిశీలించారు. కలెక్టర్ వెంట హుస్నాబాద్ తహాసిల్దార్ రవీందర్ తదితరులు ఉన్నారు.

Advertisements

You may also like

Our Visitor

019579
Total views : 91162

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.