వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్లలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా ఓట్లు అడిగే ముందు గతంలో ఏం చేశారో, గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ కు పట్టం కడితే నాలుగు కొత్త కార్యక్రమాలు తెస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.కేసీఆర్ బీమా పేరుతో రూ.5 లక్షలు అందిస్తామన్నారు.సౌభాగ్యలక్ష్మి కింద 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు నెలకు రూ.3 వేలు అందించడంతో పాటు తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఇంటికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. అలాగే అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా భవిష్యత్ లో కేసీఆర్ భరోసా కింద మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.హనుమంతుని గుడి లేని ఊరు లేదన్న కేటీఆర్ బీఆర్ఎస్ సంక్షేమం అందని ఊరు కూడా లేదన్నారు
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 4 కొత్త కార్యక్రమాలు..కేటీఆర్
73