65
హైకోర్టు ఆదేశాల మేరకు తనకు తక్షణమే 6 ప్లస్ 6 భద్రతను కల్పించాలని లేదంటే కంటెంట్ ఆఫ్ ది కోర్టు కింద కేసు వేస్తానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డీజీపీకి లేఖ రాశారు. తన భద్రతకు సంబంధించి శుక్రవారం డీజీపీ అంజనీ కుమార్కు లేఖ రాశారు. ఎన్నికలు ముగిసే వరకు తనకు భద్రత కల్పిస్తామని హైకోర్టుకు చెప్పి కూడా ఆ మేరకు భద్రత ఇవ్వడం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. హైకోర్టులో అదనపు సెక్యూరిటీతో భద్రత కల్పిస్తున్నట్లు పోలీసులు తప్పుడు వాదనలు చేశారన్నారు. పైగా గత జూలైలో తనకు ఉన్న 2 ప్లస్ 2 భద్రతను కూడా వెనక్కి తీసుకున్నారన్నారు. తనకు హైకోర్టు ఆదేశాల ప్రకారం తక్షణమే 6 ప్లస్ 6 భద్రత కల్పించాలని, లేదంటే కోర్టుకు వెళ్తానని డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.