125
ముఖ్యమంత్రి పదవిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం స్థానం పట్ల తాను ఏరోజు విముఖత చూపలేదని పవన్ కల్యాణ్ అన్నారు. సీఎం స్థానం పట్ల తాను సుముఖతతోనే ఉన్నట్లు ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి కంటే ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యం అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ప్రజల భవిష్యత్ బాగుండాలన్నదే తన లక్ష్యం అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.