తెలంగాణ ఉద్యమ నేతలంతా తిరిగి బీఆర్ఎస్ లో చేరుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డి, మామిళ్ల రాజేందర్ లు ఈరోజు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… యుద్ధాలు చేయాల్సి వచ్చినప్పుడల్లా జిట్టా తోడుగా ఉన్నారని కొనియాడారు. ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆయన విమర్శలు గుప్పించారు. నోట్ల కట్టలతో దొరికిన రేవంత్ రెడ్డి… ఎన్నికల్లో డబ్బులు పంచను అని ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. తెలంగాణను ఇచ్చామని కాంగ్రెస్ చెప్పుకుంటోందని… కానీ, ఎన్నో బాధలు పెట్టిన తర్వాతే రాష్ట్రాన్ని ఇచ్చిందని అన్నారు. ఎన్నో పోరాటాలు చేసిన తర్వాతే తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు. తెలంగాణను ఇవ్వక తప్పని పరిస్థితిని కల్పించింది బీఆర్ఎస్ పార్టీనే అని అన్నారు.
తెలంగాణ ఉద్యమ నేతలంతా తిరిగి బీఆర్ఎస్ లో చేరుతున్నారని మంత్రి కేటీఆర్
106
previous post